పొదుపు చేస్తే గెలుపు మీదే!
ఓ పక్క పెరిగే ధరలు, మరో పక్క మార్కెట్లో ఆఫర్లు. ఇటు అవసరం, ఆటు ఆకర్షణ మధ్య నలిగిపోతూ సగటు మనిషి. ఈ పరిస్థితుల్లో పొదుపు అన్నమాట ఎవరికి మాత్రం రుచిస్తుంది? కానీ తప్పదు, రేపటి అవసరాలకు భరోసా ఇచ్చేది ఒక్క పొదుపు ఖాతానే అంటున్నారు నిపుణులు.
టూత్ పేస్టు అయిపోతే ఆ ట్యూబ్‌ని అప్పడాలకర్రతో ఒత్తి మరీ పేస్టును బయటకు తీసి మరో రోజు పని కానిస్తాం.
షాంపూ పాకెట్ అయిపోతే అందులో కాసిన్ని నీళ్లు పోసి మరో తలంటు కానిచ్చేస్తాం.
పది రూపాయలు పెట్టి ఆకుకూర కొని మరో కట్ట వేయమని డిమాండ్ చేస్తాం.
ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారని రెండు ఐస్‌క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్‌లు తెచ్చి ఫ్రిజ్‌లో పడేస్తాం.
ఎంత పొదుపూ ఎంత జాగ్రత్తా అని మనకు మనమే మెచ్చుకుని మురిసిపోతాం.
కానీ... ఇది కాదు పొదుపంటే! జీతం రాగానే అందులో నుంచి కనీసం ఓ పదిశాతం పొదుపు ఖాతాలోకి మళ్లించడం, అవసరం లేనిది కొనకుండా ఉండగలగడం, కుటుంబం మిగులు బడ్జెట్‌లో ఉండేలా చూసుకోవడం... అదీ పొదుపంటే.
‘మనలో చాలామంది యాభైవేలు సంపాదిస్తూ లక్ష సంపాదిస్తున్నట్లుగా బతకాలనుకుంటారు. దేశంలో ఆర్థిక సమస్యలకు ప్రధాన కారణం అదే’ ఓ ఆర్థిక సలహాదారు అన్న ఈ మాటలు నూటికి నూరుపాళ్లూ నిజం. రూపాయి సంపాదిస్తే అందులో కనీసం పది పైసలైనా పక్కనపెట్టమని పెద్దలు చెప్పేవారు. మనమేమో సంపాదించకముందే డబ్బు ఖర్చుచేసే పద్ధతికి అలవాటు పడుతున్నాం. రాబోయే నెలే కాదు, మరికొన్ని ఏళ్ల తర్వాత సంపాదించబోయే డబ్బుకి కూడా ముందే అప్పు తీసేసుకుంటున్నాం. ఇల్లో కారో కొనేసుకుంటున్నాం. రాబోయే పదేళ్లో ఇరవయ్యేళ్లో ఆ అప్పు తీరుస్తూనే ఉంటాం. సంపాదించక ముందే ఖర్చు పెట్టడానికి అలవాటుపడిన వాళ్లకి పొదుపు విలువ ఏం తెలుస్తుంది? అందుకే పొదుపు అన్నమాట వినగానే చాలామంది అనేమాట- సంపాదించేది అవసరాలకే చాలనప్పుడు ఇంక దాచుకునేది ఎక్కడా... అని. నిజమే, అవసరం, చాలడం- అనే పదాలకు ఇప్పుడు హద్దులు చెరిగిపోయాయి. అందుకే ఈ సమస్య. అవసరాలకు లెక్క ఉండదు కానీ ఆదాయానికి లెక్క ఉంటుంది. మన అవసరాలు పెరిగినప్పుడల్లా ఆదాయం పెరగదు. కాబట్టి సంపాదన పరిధిలోనే ఖర్చుల్నీ ఉంచుకోవాలి. అంతేకాదు, భవిష్యత్తులో పెరిగే అవసరాలకీ, అనుకోకుండా వచ్చే ఖర్చులకీ కూడా డబ్బు కావాలి. ఆదాయంలో ఒక వాటా దానికీ కేటాయించాలి. దాన్నే పొదుపు అంటున్నాం. క్రమం తప్పకుండా కొంత మొత్తం పొదుపు చేయడం తప్పనిసరి అలవాటుగా మార్చుకుంటే ప్రణాళికాబద్ధంగా అవసరాలన్నీ తీర్చుకోవచ్చు. ఒక్కో నీటి బొట్టూ కలిసి సముద్రమైనట్లే మనం పొదుపుచేసే ఒక్కో రూపాయీ కలిసి కొన్నాళ్లకి పెద్దమొత్తమై అవసరాన్ని తీరుస్తుంది.
మూడిటికోసం...
పొదుపు చేసిన డబ్బు ముఖ్యంగా మూడు రకాలుగా ఉపయోగపడుతుంది.
అవసరాలకి: కుటుంబం అన్నాక రకరకాల అవసరాలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ అవీ పెరుగుతాయి. ఆ ఖర్చులన్నీ ముందుగానే అంచనా వేయగలుగుతాం కాబట్టి దానికి తగినట్లుగా రాబడి వచ్చేలా పొదుపు పథకాలను ప్లాన్ చేసుకోవాలి.
అత్యవసరాలకి: వైద్యం ఖర్చులూ ఊహించని ప్రమాదాలూ అనుకోని బాధ్యతలూ ఒక్కసారిగా వచ్చి మీద పడితే ఎదుర్కొని నిలబడగల ధైర్యాన్నిచ్చేది దాచుకున్న డబ్బే.
ఆనందాలకి: అవాంఛనీయమైన ఘటనలేమీ జరక్కుండా జీవితం సాఫీగా సాగిపోతే అంతకన్నా అదృష్టం ఉండదు. అటువంటప్పుడు పొదుపు ఖాతాలో దాచుకున్న సొమ్ముని కలలు సాకారం చేసుకోడానికి ఉపయోగించుకోవచ్చు.
పొదుపు చేయడం ఎలాగో ఈరోజుల్లో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. పోస్టాఫీసుల్లో, బ్యాంకుల్లో చిన్నమొత్తాల పొదుపు పథకాలు చాలానే ఉంటాయి. రికరింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లనుంచి మ్యూచువల్ ఫండ్ల వరకూ రకరకాలుగా డబ్బు దాచుకోవచ్చు.
అవసరమైతే ఆర్థిక వ్యవహారాల నిపుణుల సలహాలూ తీసుకోవచ్చు.
పొదుపు గురించి వారెన్ బఫెటో అమర్త్యసేనో చెప్పక్కర్లేదు. మన పక్కనున్నవారిని పరిశీలించి చూస్తే చాలు. వారి అనుభవాలే మనకు పాఠాలు చెబుతాయి. ఒక్కడి సంపాదనతోనే శ్రీనివాస్ ఇద్దరు పిల్లల్ని చదివిస్తూ చిరునవ్వు చెదరకుండా ఎలా ఉండగలుగుతున్నాడో, భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నా భాగ్యలక్ష్మి నెలాఖరు వచ్చేసరికి డబ్బుకు ఎందుకు ఇబ్బంది పడుతుందో... ఆలోచిస్తే ఏం చేయవచ్చో, ఏం చేయకూడదో మనకు తెలిసిపోతుంది. ‘నాకు 24వ ఏట ఉద్యోగం వచ్చింది. 26వ ఏట మొదటిసారి బోనస్ అందుకున్నా. తీసుకెళ్లి నాన్నకిస్తే ‘దాచుకోరా’ అన్నారు. సరేనని ఏడేళ్లకి రెట్టింపు అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాను. అలా ప్రతి ఏటా చేస్తూ పోయాను. పెళ్లయ్యాక మొదటి ఏడాది బోనస్ డబ్బుతో ఏమైనా కొనుక్కుంటావా అని నా భార్యను అడిగితే అక్కర్లేదు, ఎప్పుడూ ఏం చేస్తున్నారో అలాగే చేయండి అంది. దాంతో అదే పద్ధతి కొనసాగించా. నాకు 35 ఏళ్లొచ్చేసరికి ఇద్దరు పిల్లలూ బడికెళ్లడం మొదలెట్టారు. అప్పటికే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన డబ్బు మెచ్యూరై తిరిగి రావడం మొదలైంది. ఏటా కొత్త డిపాజిట్ వేయడం, మెచ్యూర్ అయినదాన్ని ఆ ఏడాది పిల్లల ఫీజులకు వాడడం... ఇలా చేయడంతో అసలు వారి చదువులు నాకు సమస్య కాలేదు. దాంతో జీతం డబ్బుల్ని ఇంటి లోనుకీ, జీవిత బీమాలకీ, రిటైరయిన తర్వాత జీవితానికీ సరిపోయేలా ప్లాన్ చేసుకోవడం తేలికైంది. అందుకే ఏదైనా ఊహించని పెద్ద ఖర్చు వస్తే ఎలా అన్న భయం నాకు లేదు. కేవలం బోనస్ ఒక్కటి నాది కాదు అనుకుని దాచడం వల్ల ఇంత రిలీఫ్‌గా ఉంటుందని అప్పుడు నాకూ తెలియదు’ అంటాడు శ్రీనివాస్.
‘మేం ఇద్దరం సంపాదిస్తున్నా డబ్బు ఏమైపోతుందో అర్థం కాదు’ అని వాపోతుంటుంది భాగ్యలక్ష్మి. దానికి కారణం భార్యాభర్తల మధ్య ఆర్థిక ప్రణాళిక అంటూ ఒకటి లేకపోవడమే. ‘మనకేం తక్కువ’ అన్నట్లుగా ఉంటుంది ఆమె భర్త ఖర్చు పెట్టే తీరు. పిల్లలు పది రూపాయలు అడిగితే వంద రూపాయలు ఇచ్చేస్తాడు. వారం వారం హోటల్ భోజనాలూ సినిమాలూ షికార్లూ. నలుగురు మనుషులు బయటకు వెళ్తే ఈరోజుల్లో ఎంత ఖర్చవుతుందో వాళ్లు ఎప్పుడూ లెక్కవేసి చూడలేదు. భాగ్యలక్ష్మి కూడా ఆ విషయంలో భర్తకు తగిన ఇల్లాలే. చూసిన చీరా, నచ్చిన నగా కొనేదాకా నిద్రపోదు. ‘ఉద్యోగం చేస్తున్నాను ఈమాత్రం కొనుక్కోలేనా’ అనుకుంటుంది కానీ అది అవసరమా కాదా అని ఆలోచించదు. కారు, ఇంట్లో ఫర్నిచరు, టీవీ, ఫ్రిజ్ లాంటివి ఎప్పటికప్పుడు పాతవి తీసేసి కొత్త మోడల్స్ కొనేస్తుంటారు. అలా వాళ్ల ఖర్చులకి అవసరం కన్నా ఆర్భాటం ప్రధాన కారణమవుతోంది. అవసరమేదో ఆర్భాటమెంతో యోచించుకుంటూ అడుగులు ముందుకు వేస్తేనే కుటుంబ ఆర్థిక పరిస్థితి అదుపులో ఉంటుంది.
క్రెడిట్ కార్డుతో జాగ్రత్త
క్రెడిట్, డెబిట్ కార్డులు వాడడానికి ఎంత తేలికగా ఉంటాయో ఖర్చు దగ్గరికి వచ్చేసరికి అంత భారంగానూ మారతాయి. నగదు బదులు కార్డు వాడితే ఖర్చు రెండింతలవుతుందని ఎంఐటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో రుజువైంది. చేతిలో నగదు ఉంటే దానికో పరిమితి ఉంటుంది. ఇద్దరు పిల్లలకు బట్టలు కొనడానికి స్తోమతను బట్టి రెండువేలో మూడు వేలో తీసుకెళ్తే ఆ మొత్తంలో వచ్చే ఖరీదు బట్టలే చూస్తారు. అదే నగదు బదులు కార్డు తీసుకెళ్తే పరిమితి ఏమీ ఉండదు కాబట్టి దుకాణంలో కనబడిన నచ్చిన బట్టలన్నీ చూస్తారు. ఖరీదెక్కువైనా కొనేస్తారు. అలా మనకు తెలియకుండానే బడ్జెట్ హద్దులు దాటిపోతుంది. చేత్తో నగదు ఇచ్చేటప్పుడు ఇస్తున్న డబ్బుకి తగిన విలువ తీసుకొంటున్న వస్తువుకి ఉందా అని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఒక చేత్తో డబ్బు ఇచ్చి మరో చేత్తో వస్తువు తీసుకుంటాం కాబట్టి. అదే కార్డుతో కొంటే డబ్బు చెల్లించిన ఫీలింగ్ ఉండదు. దాంతో కొనుక్కున్న వస్తువు మీదే దృష్టి ఉంటుంది. కార్డు బిల్లు తర్వాతెప్పుడో కడతాం కనుక ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టామని తెలియకుండానే ఖర్చయిపోతుంది. అలా జరగకుండా క్రెడిట్‌కార్డుతోనూ పరిమితి మేరకే ఖర్చు చేయాలనుకుంటే కొన్ని పద్ధతులు అనుసరించాలి. ప్రతిరోజూ రాత్రి ఆరోజు క్రెడిట్ కార్డుతో చేసిన చెల్లింపుల జాబితా రాసుకోవాలి. నెలనెలా క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ వచ్చాక రాసుకున్న జాబితానీ దాన్నీ పోల్చిచూడాలి. అలా చేయడం వల్ల ఎక్కడా అవకతవకలు జరగకుండా చూసుకోవడమే కాదు దేనిమీద ఎంత ఖర్చుపెడుతున్నామన్న విషయం మీదా దృష్టిపెట్టొచ్చు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం వాయిదా వేస్తే వడ్డీ ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అలా వాయిదా వేయకుండా చెల్లించాలంటే ఖర్చు పరిమితుల్లో ఉండాలి. ఎప్పుడూ కార్డు లిమిట్‌లో 30 శాతానికి మించి ఖర్చు చేయకూడదు. కార్డు నిర్వహణ, చెల్లింపులు సక్రమంగా ఉన్నప్పుడు బ్యాంకులు కొన్ని ఆఫర్లు ఇస్తుంటాయి. పెద్ద బిల్లుల్ని వాయిదాల్లో చెల్లించే వెసులుబాటూ, వడ్డీలేని రుణమూ లాంటివి ఇస్తుంటాయి. వాటిని తెలివిగా ఉపయోగించుకోవచ్చు.
అవగాహనతో చేయాలి
పొదుపుచేసే డబ్బుని మదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడమూ మంచి అలవాటే. అయితే ముందుగా ఆయా పథకాలపై సరైన అవగాహన ఏర్పర్చుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌లోనో, షేర్ మార్కెట్‌లోనో పెట్టుబడి పెట్టేవాళ్లు తగిన సమయమేదో తెలుసుకుని చేయాలి. ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు ఆవేశానికీ ఉద్వేగానికీ లోనవకుండా ఆలోచించి తీసుకోవాలి. ‘ఇరవై ఏళ్ల క్రితం ఓ రోజు. మ్యూచువల్‌ఫండ్ ఎగ్జిక్యూటివ్ ఒకరు ఆఫీసుకు వచ్చారు. నెలవారీ పెట్టుబడి పెడితే ఎంత లాభమో వివరించారు. సరేనని నెలకు రెండువేలు చొప్పున కట్టడం మొదలెట్టాను. ఓ నాలుగేళ్ల తర్వాత చూసుకుంటే నేను కట్టిన మొత్తానికి మూడింతలు అయింది. నాతో పాటు కట్టినవారు కొందరు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై ఆ డబ్బు తీసుకుని వాడుకున్నారు. నాకు అప్పట్లో అవసరాలు లేక అలాగే ఉంచాను. మరో నాలుగేళ్ల తర్వాత చూస్తే నేను కట్టినదాంట్లో సగం కూడా లేదు ఆ ఫండ్ల విలువ. చాలా బాధేసింది. ఆ ఎగ్జిక్యూటివ్‌ని కలిసి చెడామడా తిట్టాను. కట్టడం మానేశాను. ఉద్యోగంలో ప్రమోషన్లూ బదిలీల గొడవలో కొన్నాళ్లకి ఆ సంగతి మర్చిపోయాను. ఒకరోజు ఫ్రెండ్‌తో మాటలమధ్యలో మ్యూచువల్‌ఫండ్స్ ప్రస్తావన వచ్చింది. నా ఖాతా చూసుకున్నాను. ఆశ్చర్యం. నా ఫండ్స్ విలువ 30 లక్షలు దాటింది. నేను కట్టింది రూ.2.7లక్షలు. మళ్లీ ఆ ఎగ్జిక్యూటివ్‌ని వెతుక్కుంటూ వెళ్లాను. మనస్ఫూర్తిగా సారీ చెప్పాను. అతడి సాయంతో ఆ డబ్బును మళ్లీ ఇన్వెస్ట్ చేశాను. అలా ఇరవయ్యేళ్లలో నేను పెట్టిన 4.78లక్షల పెట్టుబడి రూ.75 లక్షలైంది. నా సహోద్యోగుల్లాగా కొద్దిగా లాభం వచ్చినప్పుడో, నష్టంలో ఉన్నప్పుడో తీసేసి ఉంటే ఇంత డబ్బూ నష్టపోయేవాడిని కదా... డబ్బుతో డబ్బుని సృష్టించడమెలాగో ఇప్పుడు నాకు అర్థమైంది.
అయితే అందుకు ఆవేశపూరిత నిర్ణయాలు కాదు, ఆలోచన కావాలనీ తెలిసింది’ ఓ సీనియర్ అధికారి కొత్తగా చేరిన యువ ఉద్యోగులకు తన అనుభవంతో చెప్పిన మదుపు పాఠం ఇది.
పిల్లలకీ నేర్పాలి!
పొదుపు గురించి ఉద్యోగం వచ్చాక కాదు, చిన్నప్పటినుంచే పిల్లలకు నేర్పాలి. ఏడెనిమిదేళ్ల వయసు నుంచే పిల్లలకు డబ్బు విషయాలు అర్థమవుతాయంటున్నారు పరిశోధకులు. వారికి ఆ పాఠాలు నేర్పేది తల్లిదండ్రుల
వ్యవహారశైలే కాబట్టి ముందు పెద్దలు సరైన ఆర్థిక అలవాట్లను అలవరచుకుంటే వారిని చూసి పిల్లలూ నేర్చుకుంటారనీ, పిల్లలకు ఆస్తులకన్నా మంచి అలవాట్లను వారసత్వంగా ఇవ్వాలనీ అంటున్నారు ‘మేక్ యువర్ కిడ్ ఎ మనీ జీనియస్’ అనే పుస్తకం రాసిన బెత్ కాబ్‌లైనర్. పిల్లలకు కార్డులిచ్చి ఖర్చు పెట్టుకోమనడం ఏమాత్రం భావ్యం కాదంటారామె. నగదు ఇస్తే పరిమితి మేరకు ఖర్చు పెట్టుకోవడం అలవాటవుతుంది.
పరిమితులకు లోబడి ఆర్థిక స్వేచ్ఛనివ్వడం వల్ల పిల్లలకు తాము తీసుకునే నిర్ణయాలకు బాధ్యత వహించడమూ తెలుస్తుందట. షాపింగ్‌కి వెళ్లినప్పుడు పిల్లల్ని వెంట తీసుకెళ్లాలనీ పెద్దలు చేస్తున్న వస్తువుల ఎంపిక, బేరమాడడం, డబ్బు చెల్లించడం... లాంటివన్నీ వారు చూసి నేర్చుకుంటారనీ ఆమె సలహా. ప్రత్యేకంగా పాఠంలా చెప్పకుండా ఇలా అనుభవంతో చెబితే వారికి బాగా అర్థమవుతుందంటారు బెత్.

* * * * * * * * * *
డబ్బే జీవితం కాదు కానీ జీవితంలో అడుగడుగునా డబ్బు అవసరమే. అది లేకుండా ఎవరికీ రోజు గడవదు.
పెరిగే ధరలూ స్థిరత్వంలేని ఉద్యోగాలూ అనుకోని అనారోగ్యాలూ ఊహించని విపత్తులూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే- క్రమం తప్పక ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం ఒక్కటే మార్గం. ఆ ఒక్క అలవాటునీ జీవన
విధానంలో భాగం చేసుకుంటే ఆర్థిక సమస్యలు మీ ఇంటి ఛాయలకు కూడా రాలేవు. అప్పుడిక... ఆనందం మీవెంటే, భవితంతా నిశ్చింతే!

పొదుపుకీ ఒక రోజుంది!
పేదవారికి ఒక పూట తిండి పెట్టడం కాదు, బతికే మార్గం చూపాలంటారు. నేటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఆ స్థానాన్ని ఇప్పుడు పొదుపు ఆక్రమిస్తోంది. నెల జీతాల విధానంలో వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ తలకిందులవుతోంది.
ఈ నేపథ్యంలోనే పొదుపు తెరమీదికి వచ్చింది. 1924లో ఇటలీలో తొలి అంతర్జాతీయ పొదుపు కాంగ్రెస్ సదస్సు సందర్భంగా అక్టోబరు 31ని అంతర్జాతీయ పొదుపు దినోత్సవంగా పరిగణించాలని నిర్ణయించారు. మనదేశంలో అక్టోబరు 30న సేవింగ్స్ డే జరుపుతున్నారు. పొదుపుని జీవనవిధానంలో భాగంగా చేసేలా పలురకాల కార్యక్రమాలు చేపట్టడం, పిల్లల్ని బ్యాంకులకు తీసుకెళ్లి అక్కడ జరిగే పనులను చూపించడం, యువతకు వర్కుషాపులు పెట్టడం... లాంటి పనులు చేస్తారు. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో చిన్నమొత్తాల పొదుపు పథకాలూ, జన్‌ధన్‌యోజన లాంటివీ అలా ప్రారంభించినవే. ఖాతా అంటూ ఉంటే ఎంతో కొంత డబ్బు ఎప్పుడో అప్పుడు దాచుకోకుండా ఉండరన్నది ఆశ. |
పొదుపు మంత్రాలు!
పొదుపు చేయాలనే ఉంది కానీ ఎలా అని ఆలోచిస్తున్న యువతరానికి అమెరికాకి చెందిన ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్ ఎరిన్ లోరీ చెబుతున్న చిట్కాలు కొన్ని...
* అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్ అంటారు కదా, అందుకే డబ్బుని కన్పించకుండా దాచేయండి. జీతం రాగానే కొంత మొత్తం నేరుగా మరో పొదుపుఖాతాలోకి మళ్లించండి. ఏడాది తర్వాత ఫలితం చూడండి. * ఉద్యోగంలో చేరినా కొన్నాళ్లు స్టూడెంట్‌లాగే తక్కువ బడ్జెట్‌లో సర్దుకుపోండి. జీతం రాగానే కొంత మొత్తం మాత్రమే అకౌంట్‌లో ఉంచుకుని మిగతాదంతా ఫిక్స్‌డ్ డిపాజిట్స్, ఫండ్స్‌లాంటి వాటిల్లోకి బదిలీ చేయండి. కొన్నాళ్లకి అదే అలవాటైపోతుంది. * పొద్దున టిఫినూ మధ్యాహ్నభోజనమూ బయట చేస్తున్నారా? ఓ నెల ఎంత ఖర్చయిందో లెక్కవేయండి. ‘వామ్మో... ఇంత డబ్బు తిండికి ఖర్చుపెట్టానా’ అనిపిస్తే వెంటనే మానేసి ఇంటి నుంచి టిఫిన్ తీసుకెళ్లండి. మీరు గతంలో ఖర్చుపెట్టిన మొత్తానికి సమానంగా డబ్బుని నెలనెలా అమ్మ ఖాతాలోకి మళ్లించండి. మీకు ఆరోగ్యం. అమ్మకి సంతోషం. * షాపింగ్, డిన్నర్స్ అన్నీ కూడా ఆఫర్స్ ఉన్నప్పుడు చూసుకుని ప్లాన్ చేసుకుంటే అదనపు ఖర్చులుండవు. * క్రెడిట్ కార్డు ఎడాపెడా వాడితే జీతం అంతా దానికే సరిపోతుంది. అది పక్కన పెట్టి నగదు వాడండి. డబ్బు అయిపోతోందన్న స్పృహ ఉంటుంది. ఖర్చు తగ్గుతుంది. ఆ మేరకు పొదుపు అలవాటు చేసుకోవచ్చు. * బైక్ మానేసి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడండి. దానివల్ల మూడు లాభాలున్నాయి. ఇంటికైనా ఆఫీసుకైనా సమయానికి, సురక్షితంగా చేరుకోవచ్చు. బోనస్‌గా డబ్బూ మిగులుతుంది. దాన్ని పొదుపు ఖాతాలోకి మళ్లించొచ్చు. * డెబిట్ కార్డు ఇంట్లో పెట్టేసి బయటికెళ్తే చాలు. చాలావరకు ఖర్చులు తగ్గిపోతాయి. ఖర్చు మీద నియంత్రణ రావడానికి ఇదే ఉత్తమమైన పద్ధతి. * ఇల్లు, బైక్... ఇలా మీకు ఇష్టమైన దాని గురించి ఆలోచించండి. దానికి ఎంత డబ్బు కావాలో చూడండి. డబ్బు ఖర్చు చేస్తున్న ప్రతిసారీ అది గుర్తుచేసుకుంటే ఆటోమేటిగ్గా అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. * ఏదైనా కొనేటప్పుడు మూడు ప్రశ్నలు వేసుకోండి... అది నాకు అవసరమా? ఎన్నిసార్లు వాడతాను? అది లేకపోతే వచ్చే నష్టమేంటి? ఈ మూడిటికీ సంతృప్తికరమైన సమాధానం ఉంటేనే కొనండి. అలా మూడు నెలలు చేశారంటే అప్పటికి మీ దగ్గర మిగిలిన డబ్బే మీరేం చేయాలో చెబుతుంది. Source : Ennadu Special Edtion |
No comments:
Post a Comment